calender_icon.png 10 March, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌లో గుండెమార్పిడి విజయవంతం

09-03-2025 12:35:39 AM

వైద్యులను అభినందించిన మంత్రి దామోదర 

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): గుండె జబ్బుతో బాధపడు తున్న హైదరాబాద్ కాటేదాన్‌కు చెం దిన పీ అనిల్‌కుమార్ అనే 19 ఏండ్ల యువకుడికి నిమ్స్ డాక్టర్లు పునర్జన్మ ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెత్ అయిన మరో యువకుడి గుండెను ఈ యువకుడికి విజయవంతంగా అమర్చారు. కార్డి యో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ అమరేశ్‌బాబు నేతృత్వం లోని వైద్యుల బృందం శుక్రవారం శస్త్ర చికిత్సను పూర్తి చేసింది.

ఆరోగ్యశ్రీ కింద అనిల్‌కు ఉచితంగా అవ యవ మార్పిడి చికిత్స చేశామని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీర ప్ప వివరించారు. ఆరోగ్య శ్రీ పథకంలో పేద రోగులకు ఉచితంగానే అవయవ మార్పిడి చేస్తూ నిమ్స్  వైద్యులు పేద ల ప్రాణాలకు భరోసానందిస్తోంది. అత్యధిక అవయవ మార్పిడి చికిత్సలు చేస్తున్న నిమ్స్ వైద్యులను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.