calender_icon.png 8 October, 2024 | 12:07 PM

ప్రాణాపాయ స్థితిలోని మహిళకు గుండెమార్పిడి

08-10-2024 02:27:56 AM

విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి వైద్యులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఎడమ జఠరిక పనిచేయకపో వడంతో తలెత్తిన గుండె వైఫల్యం, పునరావృతం అవుతున్న అరిథ్మియాతో డైలేటెడ్ కార్డియోమియోపతి వల్ల ప్రాణాపాయ స్థితి లో కొట్టుమిట్టాడుతున్న 39 ఏళ్ల మహిళకు బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా గుండెమార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలను కాపాడా రు. 

కేర్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్రమైన హృద్రోగ సమస్యతో బాధపడుతున్న మహిళకు గతంలోనే ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫి బ్రిలేటర్ (ఏఐసీడీ) అమర్చబడింది. అయితే, గుండె వైఫల్యం, వెంట్రిక్యులర్ టాకికార్డియో తదితర అనారోగ్య సమస్యలతో రోగి పలుమార్లు ఐసీయూలో వైద్య చికిత్స పొందు తూ వచ్చారు.

ఆక్సిజన్ మద్దతు, మిల్రినోన్ థెరపీ సహా సమగ్రమైన వైద్య నిర్వహణ ఉన్నప్పటికీ రోగిలో అనారోగ్య లక్షణాలు కొనసాగాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అతి నిద్ర తదితర లక్షణాలతో ఆరోగ్యం మరింత క్షీణించింది. 

ఈ క్రమంలో పేషెంట్ బంధువులు కేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నగేశ్ బృందాన్ని సంప్రదించారు. కేర్ ఆసుపత్రి సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డా నగేశ్ నేతృత్వంలో విజయవంతంగా గుండె మార్పిడి నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అధునాతన ఆరోగ్య సంరక్షణ విధానాలను అందించడం తమకెంతో గర్వకారణంగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ తెలిపారు.