calender_icon.png 24 January, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హృదయాన్ని కదిలించే 'గాంధీ తాత చెట్టు'

24-01-2025 04:17:00 PM

చిత్రం: గాంధీ తాత చెట్టు, నటీనటులు: సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్, నేహాల్ ఆనంద్ కుంకుమ తదితరులు. రచన దర్శకత్వం: పద్మావతి మల్లాది, నిర్మాణం: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శేష సింధురావు, సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, సంగీతం: రీ 'పుష్ప 2' తరువాత సుకుమార్ రైటింగ్స్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం కావడంతో సహజంగానే దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పైగా ఈ చిత్రంలో నటించింది. స్వయంగా సుకుమార్ కూతురు సుకృత వేణి కావడం కూడా ప్రచారపరంగా ఈ సినిమాకు కలిసొచ్చింది. సినిమాపై అంచనాలు పెరిగేందుకు దోహదపడింది. మరి అంచనాలకు అనుగణంగా సినిమా ఉందా?

కథలోకి వెలితే.. నిజామాబాద్ జిల్లా అడ్లూర్ అనే చిన్న అందమైన గ్రామంలో రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆయన గాంధీ బాటలో నడుస్తుంటారు. గాంధీ మరణం తర్వాత ఆయనకు గుర్తుగా తన చిన్నతనంలో ఒక మొక్క నాటుతాడు. అది వటవృక్షంలా మారుతుంది. ఈ చెట్టు చుట్టూనే కథంతా సాగుతుంది. రామచంద్రయ్య తన మనవరాలి (సుకృత వేణి)కి గాంధీ అని పేరు పెడతాడు. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ చిన్నతనం నుంచే గాంధీ సిద్ధాంతాలను బోధిస్తూ పెంచుతాడు. ఆ తరువాత ఊరు, తన కుటుంబంలో చోటు చేసుకునే పరిణామాల కారణంగా రామచంద్రయ్య తన భూమికి, చెట్టుకి దూరమయ్యే పరిస్థితులు రావడం... మనవరాలి వద్ద చెట్టును కాపాడమని మాట తీసుకుని మరణించడం జరుగుతాయి. మరి గాంధీ ఆ చెట్టును ఎలా రక్షించిందో తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే...

వారంతా రామచంద్రయ్య మాట వినకుండా పొలాలు అమ్ముకోవడం, అది తెలిసి ఆయన కుమారుడు సైతం తన పొలం అమ్మేసి సిటీకి వెళ్లాలనుకుంటాడు. అందుకు రామచంద్రయ్య అంగీరించాడు. దీంతో ఇంట్లో చిన్నపాటి గొడవ అవుతుంది. అప్పుడు రామచంద్రయ్య చెట్టుకు తన బాధంతా చెప్పుకుంటాడు. మనవరాలి వద్ద చెట్టును కాపాడతానని రామచంద్రయ్య మరణిస్తాడు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలను అద్భుతంగా, అకట్టుకునేలా దర్శకురాలు పద్మావతి చూపించారు.

ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే...

సినిమాలో నటన పరంగా ఎవ్వరినీ తీసి పక్కన పెట్టడానికి లేదు. ప్రతి ఒక్కరూ సహజ సిద్ధంగా నటించారు. సుకృత వేణి అయితే తన పాత్రలో ఒదిగిపోయింది. తెలంగాణ యాసలో ఆకట్టుకుంది. అయితే తొలి భాగమంతా చాలా స్లోగా ఉంటుంది. కేవలం ఊరితో పాటు పాత్రల పరిచయం, మరికొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. రెండో భాగం మాత్రం కొంత నాటకీయ పరిణామాలతో సినిమా ఆకట్టుకుంటుంది. మొదటి భాగం విషయంలోనూ కొంత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేది. మొత్తంగా 'గాంధీ తాత చెట్టు ప్రతి ఒక్కరి హృదయాన్నీ కరిగిస్తుంది.