calender_icon.png 29 November, 2024 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తాన్‌పూర్‌లో హార్ట్ స్టెంట్ల పరిశ్రమ

30-10-2024 01:58:07 AM

  1. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ
  2. హాజరైన మంత్రులు దామోదర, శ్రీధర్‌బాబు, అధికారులు  
  3. బీబీనగర్ ఎయిమ్స్ నుంచి మెడికల్ డ్రోన్ సేవలు ప్రారంభం

సంగారెడ్డి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్కులో సహజ ఆనంద్ మెడికల్ టెక్నాలజీ సంస్థలో కొత్తగా ఏర్పాటుచేసిన హార్ట్ స్టెంట్ల తయారీ పరిశ్రమను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

ధన్వంతరి జయంతి తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని, పరిశ్రమను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ దేశీయం గా హార్ట్‌స్టెంట్లు తయారు చేయడంతోనే గుండె శస్త్రచికిత్సల ఖర్చు తగ్గుతుందన్నా రు. సంగారెడ్డి జిల్లాలో హార్ట్‌స్టెంట్ల తయారు పరిశ్రమను ఏర్పాటు చేయడం అభినందనీ యని పేర్కొన్నారు. మెడికల్ డివైజ్ పార్కు లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేందు కు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని ఆయన  తెలిపారు.

దేశంలోనే సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజ్ ఎక్విప్‌మెంట్ అగ్రగామికంగా ఉండాలని ఆకాంక్షించారు. పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. దేశంలో కొత్త టెక్నాలజీతో పరిశ్రమలు ఏర్పాటు చేసే రాష్ట్రం తెలంగాణే అని మంత్రి శ్రీధర్‌బాబు తెలలిపారు. 

ఆయుర్వేద వైద్యులకు ప్రమోషన్లు: మంత్రి దామోదర

ఆయుర్వేద వైద్యులకు ప్రమోషన్లతో పాటు సమస్యలు పరిష్కరించేసేందుకు ప్ర భుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  రాజనర్సింహా తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 214 యోగా కేంద్రాలు ఏ ర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఆయుర్వేద వైద్యుల పెండింగ్ సమస్యలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు.

దేశం యోగా వైపు పోతుందని, యోగా ఆయుర్వేదంను గౌరవిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్ శాఖను మరింత బలోపేతం చేస్తామనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో టీజీఐ ఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీజీఐఐసీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎంవో కార్యాలయం అధికారి అజిత్‌రెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూరు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

బీబీనగర్ ఎయిమ్స్ నుంచి మెడికల్ డ్రోన్ సేవలు ప్రారంభం 

యాదాద్రి భువనగిరి: కేంద్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డ్రోన్ ద్వారా వైద్యసేవలను బీబీనగర్ ఎయిమ్స్ లో మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. బీబీనగర్  ఏయిమ్స్, ఢిల్లీలోని ఐసీఎంఆర్ సంయుక్తంగా చేపట్టిన ఈ డ్రోన్ ప్రాజెక్టు సేవల ను న్యూఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) ఆడి టోరియం నుంచి ప్రధాని ప్రారంభించిన అనంతరం డ్రోన్ ద్వారా ప్రయోగాత్మకం గా పరిశీలించారు.

ఎయిమ్స్ నుంచి యా దాద్రి జిల్లాలోని కొండమడుగు, బొ మ్మ ల రామారం పీహెచ్‌సీ కేంద్రాల్లో సేకరించిన టీబీ రోగుల తెమడ పరీక్షలను   భు వనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి ల్యాబ్‌కు పంంపించారు. ఆయా పీహెచ్‌సీలో షాం పిల్స్ సేకరణ, భువనగిరి చేరివేతకు కేవ లం 5 నిమిషాల సమయం తీసుకోగా, అరగంటలో పరీక్షలు పూర్తి చేసినట్టు వై ద్యాధికారులు పేర్కొన్నారు.

ఇందుకోసం ఎనిమిది కిలోల బరువును మోసే డ్రోన్ ఒకటి, 5 కిలోల బరువును మోసే మరో డ్రోన్‌ను వినియోగించారు. ఈ డ్రోన్ సేవలను అందించడానికి ఎయిమ్స్ ఆధ్వర్యం లో పైలట్ ప్రాజెక్టుగా బీబీనగర్ మండ లం కొండమడుగు, బొమ్మల రామారం, భువనగిరి మండలం బొల్లేపల్లి పీహె చ్‌సీలను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టు సేవల పరిశీలన అనంతరం దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని పీహెచ్‌సీలకు వి స్తరింప చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా తెలిపారు.