09-03-2025 12:32:23 AM
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
జనగామ/వరంగల్, మార్చి 8(విజయక్రాంతి): కారు అదుపుతప్పి ఎస్పారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ దుర్ఘటన వరంగల్ జిల్లా సంగెం మండల ంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీన్(34).. భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి (4), కుమారుడు ఆర్యవర్ధన్ సాయి (5)తో కలిసి ఓ పనిమీద హనుమకొండకు వెళ్లారు.
గురువారం కుటుం బమంతా హనుమకొండ నుంచి కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గమ ధ్యలో ప్రవీన్‌కు గుండెనొప్పి రావడంతో హాస్పిటల్‌లో చూపించుకు నేందుకు కారును వరంగల్ వైపు తిప్పాడు. అటుగా వెళ్తున్న క్రమంలో గుండెనొప్పి ఒక్కసారిగా ఎక్కువ కావడంతో సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద కారు అదుపుతప్పి నేరుగా పక్కనే ఉన్న ఎస్పారెస్పీ కాల్వలో పడింది.
స్థానిక రైతులు గమనించి హుటాహుటిన ప్రవీన్ భార్య కృష్ణవేణి, కుమారుడు ఆర్యవర్ధన్‌సాయిని బయటికి తీశారు. కృష్ణవేణి ప్రాణాలతో బయటపడగా, బాలుడు అప్పటికే మృతిచెందాడు. తండ్రీకూతురు ప్రవీణ్, చైత్రసాయి కారులోనే కొట్టుకుపోయారు. వీరి మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు జలసమాధి కావడంతో వారి స్వగ్రామం మేచరాజుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.