హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల అనుమతులకు సంబంధించిన సెక్షన్ 20పై ఇప్ప టికే సుప్రీంకోర్టు తేల్చిందని, దీని చట్టబద్ధతపై తిరిగి విచారణ చేపట్టలేమని హైకోర్టు పేర్కొన్నది. వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులు ప్రారంభించే అం శంపై అనుమతుల నిరాకరణ వివాదాన్ని తేల్చడానికి పిటిషన్లను సింగిల్ జడ్జికి నివేదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పిటిషన్లపై గురువారం విచారణ జరగనుంది.
కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెం పు, కుదింపు, కోర్సుల విలీనం, రద్దుకు ప్రభు త్వం అనుమతి నిరాకరిస్తూ ఆగస్టు 24న జారీచేసిన మెమోతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన సాంకేతిక విద్యాచట్టంలోని సెక్షన్ 20ని సవాలు చేస్తూ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంజీఆర్, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి కాలేజీ, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీ, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీతోపాలు పలు కాలేజీలు వేర్వేరుగా 11 పిటిషన్లు దాఖలు చేశాయి.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచా రణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కాలేజీలు సెక్షన్ 20ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖ లు చేశాయని, ఈ అంశంపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పిందన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాదులు కల్పించుకొని, సుప్రీంకోర్టు తేల్చని అంశాలు కూడా పిటిషన్లల్లో ఉన్నాయని చెప్పారు. అయితే, ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దనే తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టంచేసింది. సింగిల్ జడ్జి గురువారం విచారణ చేయనున్నారు.