calender_icon.png 30 September, 2024 | 5:58 PM

దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి : సుప్రీం కోర్టు

30-09-2024 03:32:27 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిగింది. లడ్డూ వ్యవహారంపై సిట్ కొనసాగించాలా..? లేదా..? సహకారం ఇవ్వాలని ఎస్జీని కోరిన ధర్మాసనం కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారం అని తెలిపింది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా..?, సిట్ ను కొనసాగించాలో లేదో..? చెప్పాలని కేంద్రాన్ని కోరింది.

రెండో అభిప్రాయం తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో ఎలా మాట్లాడారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనే వివరాలను  టీటీడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేమున్నాయని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విని తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.