calender_icon.png 30 April, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1పై టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌పై విచారణ

30-04-2025 12:02:45 PM

హైదరాబాద్: గ్రూప్-1పై టీజీపీఎస్సీ(Telangana Public Service Commission) దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ కోరింది. సీజేధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయడానికి నిరాకరించింది. ఇవాళ సింగిల్ బెంచ్ లో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోలేమని సీజే ధర్మాసనం తేల్చిచెప్పింది. సింగిల్ బెంచ్ లో పిటిషన్లపై తేల్చుకోవాలని ధర్మాసనం తెలిపింది. గ్రూప్ వన్(TGPSC Group-1 Mains examination results) మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యుర్థులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని అభ్యర్థులు ఆరోపించారు.

రీకౌంటింగ్ లో మార్కులు, టీజీపీఎస్సీ జారీ చేసిన మెమో మార్కులకు తేడాలున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) పిటిషన్లపై విచారణ చేపట్టి గత నెల 17న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  గ్రూప్ వన్ నియామక పత్రాలు(Group-1 Recruitment Documents) ఇవ్వొద్దని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఆదేశించారు. సర్టిఫికెట్ల పరిశీలన చేయొద్దని సింగిల్ బెంచ్ చెప్పింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టును కోరారు. సింగిల్ బెంచ్ పిటిషన్లపై విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనం ఆదేశించింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు విచారణ ముగిసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత సింగిల్ బెంచ్ లో గ్రూప్ వన్ పిటిషన్లపై విచారణ జరగనుంది. గ్రూప్-1 టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ పై విచారణ జరగనుంది.