calender_icon.png 4 February, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి రెండు పిటిషన్లపై విచారణ 20కి వాయిదా

04-02-2025 01:56:49 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో నమోదై న రెండు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 2020లో దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. నాటి మంత్రి కేటీఆర్‌కు చెందిన జన్వాడ ఫాంహౌస్‌పైకి అనుమతుల్లేకుండా డ్రోన్లు పంపించడంపై కానిస్టేబుల్ జి.వెంకటేశ్ ఫిర్యాదుతో నార్సింగి స్టేషన్లో కేసు నమోదైంది.

కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారు వెంకటేశ్ కౌంటర్ వేయకపోవడంతో వెంట నే కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు.

తనపై నమోదైన అట్రాసిటీ కేసు కొట్టివేయాలం టూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా న్యాయమూ ర్తి విచారణ వాయిదా వేశారు. రేవంత్‌రెడ్డి తరఫు న్యా యవాది రజనీకాంత్‌రెడ్డి ఏఏజీగా నియమితులు కావడంతో మరో న్యాయవాది వకా ల్తా వేసేందుకు అంగీకరించారు.