వికారాబాద్, నవంబర్ (విజయక్రాంతి): లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా, ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో వికారాబాద్ కోర్టులో విచారణ చేపట్టలేదు. బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.