calender_icon.png 8 January, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ పిటిషన్‌పై విచారణ

15-10-2024 12:59:57 AM

18న కేటీఆర్ సహా సాక్షుల స్టేట్‌మెంట్లు రికార్డు చేయనున్న నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి):  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం..

ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు ఆయన పిటిషన్‌లో పేర్కొన్న సాక్షుల స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తామని తెలిపింది. కేసును ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఆమె తనపై చేసిన వ్యా ఖ్యలు దారుణమని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం చేకూర్చాయని, ఆమెపై బీఎన్‌ఎస్ యాక్ట్ 365 సెక్షన్ ప్రకారం వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను తన తరఫున సాక్షులుగా  పిటిషన్‌లో పేర్కొన్నారు. కొండా సు రేఖ వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు, సోషల్ మీడియా కథనాలు, పలు టీవీ ఛానల్‌లలో వచ్చిన వార్తలను పెన్‌డ్రైవ్ ద్వారా కోర్టుకు సమర్పించారు.

పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు, ఫొటోలను, 23 రకాల సాక్ష్యాలను  పిటిషన్‌కు జోడించారు. మంత్రి వ్యాఖ్యలపై పరువు నష్టం దా వా వేస్తానని ఆమెకు గతంలోనే లీగల్ నోటీసులు ఇచ్చానని, వారం రోజుల్లో బహిరంగ  క్షమాపణ చెప్పాటని నోటీసుల్లో పేర్కొన్నట్లు చెప్పారు.

ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో  ఆమెపై పరువు నష్టం దావా వేసి నట్లు తెలిపారు. తాను సిరిసిల్ల నియోజకవర్గానికి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా,  2023-2014 వరకు  మంత్రిగా పని చేశానని పిటిషన్‌లో చెప్పారు.