calender_icon.png 15 January, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 29కి వాయిదా

17-07-2024 06:21:47 PM

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ అరెస్టుపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ తో పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేశారు. దీంతో కేజ్రీవాల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను జూలై 29వ తేదీకి వాయిదా వేసింది. కేజ్రీవాల్ తరుపున అభిషేక్ మనుసింఘ్యీ, విక్రమ్ చౌదరి, సీబీఐ తరుపు పబ్లిక్ న్యాయవాది డీపీ సింగ్ వాదనాలు వినిపించారు.

కేజ్రీవాల్ ఒక రాష్ట్రానికి సీఎం అని.. ఆయన ఏం ఉగ్రవాది కాదని ఆయన తరుపు న్యాయవాది పేర్కొన్నారు. కొన్ని నెలలుగా జైలుల్లో ఉన్న కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేయలేదని, ఈడీ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగానే సీబీఐ అరెస్టు చేసిందని కోర్టు వెల్లడించారు. కేజ్రీవాల్ నిద్రపోతున్న సమయంలో ఫుగర్ లెవల్స్ పడిపోతున్నాయని, అది అతనికి ప్రమాదకరమన్నారు. ఈ కేసులో ఉన్న వాళ్లందరికి బెయిల్ వచ్చిందని కేజ్రీవాల్ కు మాత్రం రాలేదన్నారు.

వాస్తవాలను పరిశీలించి బెయిల్ ను మంజూరు చేయాలని కోరారు. కేజ్రీవాల్ ను ప్రశ్నించేందుకు చట్ట ప్రకారం అనుమతి అవసరమని సీబీఐ తరఫు న్యాయవాది డీపీ సింగ్‌ వాదించారు. ఈ కేసులో జనవరిలో సాక్షిగా మారిన మాగుంట వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. అంతకుముందు ఏం చేయలేదన్నారు. దర్యాప్తు సంస్థగా సీబీఐకి సొంత హక్కులు ఉన్నాయని.. ఏ నిందితుడిపై ఛార్జిషీట్‌ను ఎప్పుడు దాఖలు చేయాలని.. ఏ నిందితుడిని ఎప్పుడు పిలవాలో నిర్ణయించే హక్కు ఉందని పేర్కొన్నారు.