calender_icon.png 26 October, 2024 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంలో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

16-07-2024 12:25:18 AM

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యుత్ అవకత వకల ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణను  సుప్రీంకోర్టు మంగ ళవారానికి వాయిదా వేసింది. సోమవారం విచారణ జరగాల్సి ఉండగా  కోర్టు సమయం ముగియడంతో పిటిషన్ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. దీంతో కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు  ఎలాంటి తీర్పు ఇస్తుందోనని రాష్ట్ర రాజకీయాల్లో  హాట్ హాట్‌గా మారింది. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై భద్రాద్రి, యాదాద్రి థర్మల్  విద్యుత్ కేంద్రాల నిర్మాణ తదితర అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కమిష న్‌ను ఏర్పాటు చేసింది.

వెంటనే జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్యంలో కమిషన్ వేసింది. కేసీఆర్‌కు నోటీసులు జారీచేసి విచారణకు పిలిచింది. తనకు నోటీసులు ఇవ్వడంపై కేసీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. కమిషన్ రద్దు కోరుతూ మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కేసీఆర్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టులో ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప దానిపై విచారించే అధికారం కమిషన్‌కు లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.