calender_icon.png 7 October, 2024 | 7:10 PM

జానీ పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా

07-10-2024 04:23:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి జిల్లా కోర్టులో సోమవారం విచారణ జరిగింది. జానీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. తిరుచిత్రంబళం (2022) చిత్రానికి గానూ జానీ మాస్టర్‌ని ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు గ్రహీతగా ప్రకటించారు. అక్టోబరు 8న ఉత్తమ కొరియోగ్రఫీ జాతీయ అవార్డును అందుకోవాల్సిన నేపథ్యంలో జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, పోక్సో చట్టం కింద  జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డుల జ్యూరీ ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును రద్దు చేసింది. దీంతో మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టులో మెమో  దాఖలు చేశారు.