calender_icon.png 24 September, 2024 | 5:57 PM

జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్.. తీర్పు వాయిదా

24-09-2024 03:53:20 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై మంగళవారం వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్ పై జానీ మాస్టర్ ను ఇవాళ పోలీసులు రంగారెడ్డి కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం తీర్పును రేపటీకి వాయిదా వేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సహాయ కొరియోగ్రాఫర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు ఈనెల 19న అరెస్టు చేశారు. విషయం తెలిసిందే. జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమండ్ విధించింది. కాగా నార్సింగ్ పోలీసులు మాస్టర్ ను 5 రోజుల కస్టడీకి కోరారు. పోక్సో కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.