calender_icon.png 5 April, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

03-04-2025 12:38:19 PM

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు(Hearing of MLA defection case) విచారణ గురువారం ముగిసింది. అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. నేడు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తీర్పు రిజర్వ్ చేసింది. అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi) అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేదని సింఘ్వి తెలిపారు. మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైనదని చెప్పిన అభిషేక్ మను సింఘ్వి ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని పేర్కొన్నారు. రాణా కేసు పూర్తిగా ప్రత్యేకమైనది, ప్రస్తుత అంశానికి సరిపోదని సింఘ్వి స్పష్టం చేశారు. రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించిందని జస్టివ్ గవాయ్ సూచించారు. మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ ఏంటని సింఘ్విని జస్టిస్ గవాయ్(Justice Bhushan Ramkrishna Gavai) ప్రశ్నించారు. సుప్రీం కోర్టు కు వచ్చిన తర్వాత న్యాయవాదుల తీరు పూర్తిగా మారిపోతోందని జస్టిస్ గవాయ్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(BRS MLA Kaushik Reddy) న్యాయవాది సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు మరోసారి ప్రస్తావించారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచైనా రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారని న్యాయవాది గుర్తుచేశారు. సీఎం వ్యాఖ్యల ప్రస్తావనపై ముకుల్ రోహత్గీ అభ్యతరం చెప్పారు. సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఘటనే జరిగిన తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని న్యాయవాదిని జడ్జి అడిగారు. ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని సింఘ్వి ధర్మాసనానికి సూచించారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని సుప్రీం కోర్టు ధర్మాసనం(Supreme Court bench) పక్కన పెట్టింది. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. మేము సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని జస్టిస్ గవాయ్ ఆదేశించారు. స్పీకర్ కు ఫిర్యాదు చేసి కోర్టు కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావలని చూశారని సింఘ్వి వెల్లడించారు. సింగిల్ జడ్డి సూచనలు పాటిస్తే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జడ్జి మెట్టికాయాలేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాతే నోటీసులు ఇచ్చారని ఆయన వివరించారు. మణిపూర్ వ్యవహారం, రాణా కేసు అంశాలను సింఘ్వి కోర్టుకు వివరించారు.

ఈ కేసులో కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ఆర్యామ సుందరం(Kaushik Reddy lawyer Aryama Sundaram) వాదనలు వినిపిస్తున్నారు. సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై సుప్రీం కోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చిందని సుందరం తెలిపారు. స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు కు అన్ని అధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తగిన సమయంలో స్పీకర్ తప్పక నిర్ణయం తీసుకోవాలని సుందరం డిమాండ్ చేశారు. సుభాష్ దేశాయ్ కేసు(Subhash Desai case)లో రాజ్యాంగ ధర్మాసనం ఇదే చెప్పిందన్నారు. జనవరిలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టాక స్పీకర్ నోటీసులిచ్చారని సుందరం తెలిపారు. స్పీకర్ మూడు వారాలు సమయం ఇచ్చారన్నారు. ఆ మూడు వారాల గడువు పూర్తి అయిందని సూచించారు. నోటీసులిచ్చిన విషయం ప్రతిపక్ష నేతకు కూడా ఇవ్వలేదని సుందరం పేర్కొన్నారు. తాము సీఎం వ్యాఖ్యల విషయంలోకి వెళ్లట్లేదని ధర్మాసనం తెలిపింది.