calender_icon.png 13 December, 2024 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై విచారణ అత్యవసరం కాదు: పీపీ

13-12-2024 05:54:00 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ తనపై నమోదైన కేసు కొట్టేయాలని శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని సంధ్య థియేటర్ న్యాయవాది పేర్కొన్నారు. ప్రీమియర్ షో గురించి రెండు రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అల్లు అర్జున్ థియేటర్ కు ర్యాలీగా వచ్చారని కోర్టుకు పోలీసులు వెల్లడించారు. అదే విధంగా అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు.

అల్లు అర్జున్ పై సంబంధం లేని కేసులను పోలీసులు నమోదు చేశారని, ఇలాంటి కేసులను గతంలో అహ్మదాబాద్ హైకోర్టు కొట్టేసిందని న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్టు వేళ సుప్రీంకోర్టు సూచనలు పాటించాలని, అప్పీల్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. క్యాష్ పిటిషన్ లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్ల అర్జున్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పుష్ప-2 సినిమా విడుదల రోజు థియేటర్ కు వెళ్తారని, థియేటర్ యాజమాన్యం, నిర్మాత, పోలీసులకు సమాచారం ఇచ్చారని నిరంజన్ రెడ్డి కోర్టు వెల్లడించారు.

ఆయనను ఏ-11 గా పేర్కొంటూ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసులు రిమాండ్ నివేదికలో వెల్లడించారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై విచారణ అత్యవసం కాదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమవారం విచారించాలన్నారు. అల్లు అర్జున్ అరెస్టు కావడంతో బెయిల్ కోసం మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని  పీపీ తెలిపారు. రోడ్ షోకు అనుమతి తీసుకోలేదని, థియేటర్ కు వెళ్లవద్దని అల్లు అర్జున్ ను పోలీసులు ముందే చెప్పినప్పటికి ఆయన వెళ్లారని పీపీ కోర్టుకు తెలియజేశారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్ లో ఎక్కడా కోరలేదన్నారు.