25-03-2025 12:07:06 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ కోనసాగుతుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మసనం విచారణ చేపట్టింది. పాడి కౌశిక్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్వీకర్ స్పందించలేదని, స్పీకర్ స్పందించి నోటీసు కూడా ఇవ్వలేదని న్యాయవాది పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడారని సుందర్ వెల్లడించారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారు.
ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని ధర్మసనం ఆదేశించిన స్వీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదని న్యాయవాది సుందరం తెలిపారు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని ఫిబ్రవరి 13వ తేదీన స్వీకర్ నోటీసు ఇచ్చారని, ఇప్పటికి మూడు వారాలైంది నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదని న్యాయవాది కోర్టు వెల్లడించారు. తాము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్వీకర్ షెడ్యూల్ కూడా చేయలేదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా అని జడ్జీ జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సోమవారం సాయంత్రం సుప్రీంకోర్టులో అసెంబ్లీ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు అనడం సరైందికాదని ఆయన మండిపడ్డారు. అనర్హత చట్టం ప్రకారమే స్పీకర్ నడుచుకుంటున్నారని, పిటిషనర్లు దురుద్దేశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ ను ఆశ్రయించిన వెంటనే కోర్టును ఆశ్రయించారని, పార్టీ ఫిరాయింపులపై వేసిన పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు.