18-04-2025 12:00:00 AM
మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ
కామారెడ్డి, ఏప్రిల్ 17(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ,రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్లు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కేసును వాదిస్తున్న సల్మాన్ ఖుర్షీద్ బృందం లో కలిసిన అనంతరం ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. వక్ఫ్ (సవరణ)చట్టం-2025 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ప్రారంభించింది.
సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టింది. అన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం కేవియెట్ దాఖలు చేసిందన్నారు. విచారణకు ముందు సుప్రీంకోర్టు తమ ఎదుట రెండు ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంది.
మొదటిది కేసును విచారించాలా? లేదంటే హైకోర్టుకు అప్పగించాలా? రెండోది న్యాయవాదులు వాదించాలనుకుంటున్న అంశాలపై విచారణ స్వీకరించాల లేదా అనే విషయం తెలిపిందన్నారు. ఓ పిటిషనర్ తరఫున తమ సీనియర్ న్యాయవాదుల బృందం వాదనలు వినిపించారు.
పార్లమెంట్ చట్టం ద్వారా మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాల్లో తలదూర్చడమే అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందన్నారు.