calender_icon.png 16 January, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుధాన్యాలతో ఆరోగ్యం పదిలం

27-08-2024 12:03:46 AM

పద్మశ్రీ పురస్కార గ్రహీత ఖాదర్ వలీ

రాజేంద్రనగర్, ఆగస్టు26: చిరుధాన్యాల వినియోగంతో ఆరోగ్యం పదిలం అవుతుందని ప్రద్మశ్రీ పురస్కార గ్రహీత ఖాదర్ వలీ అన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణ భారత్ ట్రస్టులో రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్టు సహకారంతో కర్షక సేవాకేంద్రం నిర్వహణలో జరుగుతు న్న ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ప్రతీఇంట్లో నూ కనీసం ఒకరు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారన్నారు.

పుట్టే ప్రతీ 100 మందిలో పది మంది బుద్ధిమాంధ్యంతో జన్మించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం చాలామంది పిల్లలు జంక్ ఫుడ్‌కు అలవాటుపడ్డారని, ఇదిఏమాత్రం ఆరోగ్యదాయకం కాదని చెప్పారు. సంపూర్ణ ఆరో గ్యం కోసం చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ముఖ్య కా ర్య నిర్వహణ అధికారి డీవీఎన్ రావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.