పతంజలి యోగా గురువు రాందేవ్ బాబా శిష్యుడు పరమార్థ దేవ్
కామారెడ్డి, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి) : యోగ సాధన తో ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు అని పతంజలి యోగ గురువు రాందేవ్ బాబా శిష్యుడు పరమార్థ దేవ్ అన్నా రు. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక పూట భోజనం మాత్రమే చేయాలని సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పట్టణం ప్రొబెల్స్ ఉన్నత పాఠశాల ఆవరణలో మూడు రోజులపాటు ఏర్పాటుచేసిన యోగా శిక్షణ శిబిరానికి విశిష్ట అతిథిగా హాజరై మాట్లా డారు.
రెండవ రోజు యోగ సాధకులను ఉద్దేశించి ప్రసంగించారు. రోజుకు ఒక పూట ఆహారం భుజించే వారు యోగులని, రెండు పూటల ఆహారం భుజించేవారు బోగులని, మూడు పూటల ఆహారం భుజించేవారు రోగులని అన్నారు. శాఖ ఆహారం భుజిం చడం వల్ల 100 ఏండ్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అన్నారు.
యోగ చేయడం వల్ల రోగాలు దరిదాపులోకి కూడా రావని ఆయన చెప్పారు. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న షుగర్ వ్యాధి అదుపులో పెట్టుకోవడానికి చేయవలసిన ఆసనాలను ఆయన చేస్తూ యోగా సాధకులకు సూచిం చారు. కుటుంబ సభ్యులు రెండు గంటలు యోగ సాధన చేసినట్లయితే ఆ గృహం రోగాలు లేని స్వర్గ సీమ అవుతుందన్నారు.
ముఖ్యంగా మహిళలు యోగా పట్ల అవ గాహన పెంచుకొని యోగ సాధన నేర్చు కుంటే కుటుంబం మొత్తం ఆరోగ్యవం తమైన కుటుంబంగా అల్లాదకరంగా ఉం టుందన్నారు. ప్రకృతికి ఎంత దగ్గర ఉంటే రోగాలు అంత దూరంగా ఉంటాయని సూచించారు. యోగసాధకులు ముఖ్యంగా శ్వాస మీద దృష్టి సారిస్తే యోగ సాధన నేర్చుకోవడం సులభతరం అవుతుంది అని చెప్పారు.
యోగ సాధన వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ఏ సమస్యనైనా లౌక్యంగా పరిష్కరించుకునే మార్గం మనిషికి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అధ్యక్షులు గురువు గడ్డం రామ్ రెడ్డి, యోగా గురువులు అంజయ్య గుప్తా అనిల్ రెడ్డి విరామ ఉపాధ్యాయుడు అంజయ్య ,బాసరఘుకుమార్, గురు చరణ్, సిద్దాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.