calender_icon.png 25 November, 2024 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలికాలంలో ఆరోగ్యంగా..

25-11-2024 12:00:00 AM

చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటి వల్ల శరీరమంతా నీరసంగా మారు తుంది. అంతేకాకుండా చలికాలంలో వెచ్చగా ఉండటం కూడా ముఖ్యం. ఈ సీజన్ వచ్చే వ్యాధుల్ని తట్టుకోవాలంటే శరీరానికి కావా ల్సిన శక్తిని అందించాలి. అందుకే చలికాలంలో కొన్ని ప్రత్యేక ఆహారారం తీసుకోవా లి. ఆహారంలో మిల్లెట్స్ చేర్చుకోవడానికి వింటర్ సీజన్ బెస్ట్ టైమ్.

జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి మిల్లెట్స్ కిందకి వస్తా యి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకా కుండా కఠినమైన చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి, జీర్ణవ్యవ స్థను ఆరోగ్యం ఉంచడం లో మిల్లెట్స్ సాయపడతాయి.

అలాగే పాల కూర, బచ్చలి కూర, కాలే, తోటకూర వంటి ఆకు కూరల్ని చలికాలంలో తప్పక తినా లి. ఇవి పోషకాల నిధి ఆకుకూరలు తక్కువ కేలరీల ఆహారం మాత్రమే కాదు.. వీటిలో యాంటీఆక్సిడెం ట్లు, బీటా కెరోటిన్, రోగనిరోధక శక్తిని ప్రేరేపించే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి.