19-04-2025 06:20:34 PM
సూపర్వైజర్ పరిమి రజిని..
వేములపల్లి (విజయక్రాంతి): గర్భిణి, బాలింతలకు సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని సూపర్వైజర్ పరిమి రజిని అన్నారు. శనివారం దామరచర్ల ప్రాజెక్టు పరిధిలో గల వేములపల్లి మండలం బుగ్గబాయి గూడెం అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించి మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ వైద్య అధికారులు సూచించిన సలహాలను పాటించి సరైన టైంలో మందులు వాడాలని అన్నారు.
అదేవిధంగా మధ్యాహ్నం పూట సుమారు రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డిలవరి చేసుకోవాలని కోరారు. గర్భవతులు ప్రతిరోజు చిరుధాన్యాలు, పప్పులు, పండ్లు, పాలు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శాంతా, ఏఎన్ఎం శైలజ, కవిత, అంగన్వాడీ టీచర్స్ రోజా ,శశికళ, సోమాచారి, ఆశా వర్కర్ లక్ష్మీ, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.