16-03-2025 10:23:38 PM
ప్రముఖ సినీ నటి అనన్య...
ఎల్బీనగర్: వనస్థలిపురంలోని రాఘవేంద్ర మఠం సమీపంలో స్వీట్ వన్ స్వీట్ హౌస్ ను ఆదివారం ప్రముఖ సినీ నటి అనన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భోజన ప్రియులకు రుచికరమైన స్వీట్లు అందజేసినప్పుడే షాపు మనుగడ సాగిస్తాయన్నారు. నాణ్యమైన తీపి తినుబండారాలను అందించాలని షాపు నిర్వాహకులకు సూచించారు. స్వీట్ హౌస్ ఎండీ ఎన్.శంకర్ నారాయణ మాట్లాడుతూ... నగరంలోని వనస్థలిపురంలో మొదటి బ్రాంచ్, చింతల్ ప్రధాన రహదారి వద్ద రెండో బ్రాంచ్ ప్రారంభించామన్నారు. కస్టమర్ దేవుళ్లకు రుచి, శుచి తో తినుబండారాలను అందజేస్తూ మెరుగైన సేవలను అందజేస్తామని తెలిపారు. సుమారు 50 పైగా వివిధ రకాల స్వీట్లను స్వయంగా తయారుచేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం.గౌరీశ్, ఆర్.వాసు, భాను ప్రసాద్, జె.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.