రేగుపండ్లు పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరడం కామన్.. పుల్లగా, తియ్యగా ఉండే రేగు పండ్లను అందరు ఎక్కువగా ఇష్టపడతారు. ఇది రేగు పండ్ల సీజన్.. ఎక్కడ చూసిన బండ్లపై రేగు పండ్లు దర్శనం ఇస్తాయి.. రోజు ఒక గుప్పేడు రేగు పండ్లు తింటే అనారోగ్యం దరిచేరదంటున్నారు నిపుణులు. రేగు పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
* రేగు పండ్లలో ఉండే విటమిన్ సి చర్మం మెరిసేలా చేస్తుంది. ఎండబెట్టిన రేగుపళ్లలో ఉండే కాల్షియం ఫాస్పరస్ ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి. రేగి పండ్లలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. రేగిపండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫైటో కెమికల్స్, పాలీశాకరైడ్స్, ఫ్లేవనాయిడ్స్, సపోనిన్స్ వంటివి మంచి నిద్రగా సహాయపడతాయి. రక్తంలో చక్కెరను తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. రేగు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. రోజువారీ ఆహారంలో రేగు పండ్లను చేర్చడం వల్ల మలబద్ధకం నివారించవచ్చు.
* ఈ పండ్లు ఆస్టియో ఆర్థరైటిస్‌ను నివారించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచ డానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతా యి. రేగు పేస్టును చర్మంపై పూయడం వల్ల గాయం నయం కావడంతో పాటు చర్మం మృదువుగా మారుతుంది.
* రేగులో యాంటీ మైక్రోబయల్, యాం టీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఆకలిని తగ్గించడంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి రేగుపండ్లు సహాయపడతాయి. రేగి పండ్లలో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి.