ఈ సీజన్లో జలుబు, దగ్గు, జ్వరం, జీర్ణకోశ సమస్యలతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దినచర్యను ఆరోగ్యవంతంగా కొనసాగించాలనుకుంటే ఒక చెంచా అల్లం రసాన్ని తులసి ఆకులు, బెల్లం కలిపి తీసుకోండి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శీతాకాలంలో అల్లం రసం తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు సమస్య ఉండదు. ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అయితే తులసిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు, ఫ్లూ లాంటివాటికి చెక్ పెడుతుం ది. అదే సమయంలో బెల్లంలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు.. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి వారంలో నాలుగైదు రోజు అల్లం రసం మిశ్రమాన్ని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.