calender_icon.png 30 September, 2024 | 4:47 PM

రాగి చెంబుతో ఆరోగ్యం..

30-09-2024 12:00:00 AM

అప్పట్లో మన తాతలు వాడే ప్రతి వస్తువు వెనుక ఆరోగ్య పరమార్థం ఉండేది. అందుకే ఇంట్లో కచ్చితంగా రాగి చెంబు ఉండేది. రాగి చెంబులోని నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని భావించేవారు. మనపెద్దవాళ్లు ఇప్పటికీ రాగి చెంబులోని నీరు తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఆధునిక యుగంలో ప్లాస్టిక్ వాడకం పెరిగిన తర్వాత రంగురంగుల ప్లాస్టిక్ బాటిళ్లు ఇంట్లో దర్శనమిచ్చినా ఇప్పటికీ వీటి వాడకం ఉంది.

ఆయుర్వేదం ప్రకారం.. రాగి చెంబులో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన కాపర్ సమృద్ధిగా లభిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కాబట్టే మనవాళ్లు రాగి చెంబుకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.