calender_icon.png 17 March, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాయామంతోనే ఆరోగ్యం

17-03-2025 12:55:07 AM

  • కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ 
  • కొత్తపేట డివిజన్ పరిధిలో ఓపెన్ జిమ్ ప్రారంభం 

ఎల్బీనగర్, మార్చి 16: ప్రతి రోజూ వ్యాయామం చేసి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ సూచించారు. కొత్తపేట డివిజన్ లోని సత్యానగర్ జనప్రియ కాలనీ,  మానస ఎన్ క్రేవ్, మోహన్ నగర్ జనప్రియ, స్నేహ పురి కాలనీల్లో రూ. 47 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్ లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా సత్యానగర్ జనప్రియ అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఆదివారం కార్పొరేటర్ పవన్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అపార్ట్‌మెంట్ ప్రజలంద రూ ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో అపార్ట్ మెంట్ అధ్యక్షుడు స్వామి, సెక్రెటరీ కిశోర్, శ్రీనివాస్, భానుప్రసాద్, రామ్మోహన్ రెడ్డి, పృథ్వీ, నాయకులు మంచి రాజేశ్, వెంకట్ రెడ్డి, తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.