calender_icon.png 20 April, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య తెలంగాణ ఆగమైతుంది

20-04-2025 12:59:16 AM

‘ఎక్స్’లో ధ్వజమెత్తిన కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాం తి): కాంగ్రెస్ పాలనలో ఆరోగ్య తెలంగాణ ఆగమైతుందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. ములుగులో వైద్యుల నిర్లక్ష్యం కార ణంగా పసిబిడ్డ మరణించిందని తెలిపారు. 

న్యాయం చేయాలని మంత్రులు పొంగులేటి, సీతక్కలను ఆశ్రయిస్తే వారు నిర్లక్ష్యంగా వ్యవహారించినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. రోడ్ షో సందర్భంగా కనీసం వాహానం ఆపకుండా వారిని పక్కకు నెట్టేసి వెళ్లిపోవడం బాధాకరమని పేర్కొన్న కేటీఆర్ ‘కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’ హ్యష్‌ట్యాగ్‌ను జత చేశారు. వైద్య పరీక్షల భారం నుంచి పేదలను కాపాడేందుకు పెట్టిన డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు సీఎం చేతకానితనంతో మూలనపడే దుస్థితి నెలకొన్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.