calender_icon.png 10 January, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ ప్రభావంతో అనారోగ్య సమస్యలు

01-01-2025 01:13:01 AM

 శ్వాస ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విష్ణున్‌రావు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (విజయక్రాంతి): పర్యావరణ ప్రభావాల వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయని శ్వాస హాస్పిటల్, ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విష్ణున్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ, నివారణకు మించినది మరోటి లేదని పేర్కొన్నారు.

మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు, కాలుష్యం వలన కలిగే శ్వాసకోశ వ్యాధులు, ఒత్తిడి వల్ల వమానసిక ఆరోగ్య సమస్యలు కలుగుతున్నట్లు చెప్పారు. వ్యాధులు పెరుగుతున్నందున వైద్యులపైవైద్యులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘శ్వాసకు స్వేచ్ఛ’ అనే లక్ష్యంతో శ్వాసకోశ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.