calender_icon.png 16 March, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో హెల్త్ పెన్షన్ అమలు చేయాలి

15-03-2025 11:22:50 PM

తలసేమియా వెల్ఫేర్ సొసైటీ 

రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్

మందమర్రి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడు తున్నారని వారికి రాష్ట్ర  ప్రభుత్వం హెల్త్ పెన్షన్ అమలు చేయాలని తల సేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పట్టణంలో శనివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. అనేక మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నారని, అంతే కాకుండా  పక్షవాతం వల్ల మంచానికే పరిమితం అయిన వారికి, తీవ్ర కండరాల దుర్భ లత, ప్రమాదాల కారణంగా  వీల్ చైర్, మంచానికి పరిమిత మైన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 15 వేల రూపాయలను ప్రతి నెల హెల్త్ పెన్షన్ అందిస్తుందనీ ఆయన  గుర్తు చేశారు.

దీర్ఘకాలిక వ్యాధులు అయిన తల సేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా, డబుల్ ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4, నిరంతర మూత్రపిండాల వ్యాధి, కుష్టి వ్యాధి, తీవ్రమైన బోదకాలు, పోలియో, కిడ్నీ, లివర్, హార్ట్ మార్పిడి అయినవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సదరం సర్టిఫికెట్ తో సంబంధం లేకుండా ప్రతినెల పదివేల రూపాయల పెన్షన్ తో పాటు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారని దీనిని తెలంగాణ రాష్ట్రంలో   అమలు చేసి బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు హెల్త్ పెన్షన్ అమలు చేసి వారికి మనోధైర్యం కల్పించా లని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.