calender_icon.png 25 October, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి

02-09-2024 04:39:21 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఎల్. యశోద పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఇంటి పరిసరాలలో నీటి విలువలు ఏర్పడి దోమలు పుట్టడాని అవకాశం ఉంటుందని, వాటి వలన మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వంటి వ్యాధులు వ్యాప్తి చెండడానికి అవకాశమున్నందున ప్రజలు వారి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆరుబయట, రోడ్లపై అమ్మే ఆహారపదార్థాలు, నీటిని ఉపయోగించడం వలన అతినిర విరేచనాలు వచ్చే అవకాశం ఉందని. ఇంటి వద్దనే వేడి పదార్ధాలు. కాచి చల్లార్చిన నీటిని ఉపయోగించి ఆరోగ్యం పై జాగ్రత్తలు పాటించాలన్నారు.

సాంఘిక సంక్షేమ పాఠశాలలు, హాస్టల్స్ లో విద్యార్దులకు పెట్టే ఆహారపదార్థాలు వేడిగా ఉండేలా చూడాలని, అన్ని ఆహార పదార్ధాలపై మూతలు ఉండేలా జగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్దులను బయటి పదార్థాలు తీసుకోకుండా చూడాలన్నారు. పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే సంబంధిత వైద్యాధికారికి లేదా ఆశా కార్యకర్తలకు తెలియజేసి వైద్య సహాయం పొందాలన్నారు. ఏదైనా సమాచారం వైద్య సహాయం కొరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 8125147540 ను సంప్రదించాలని తెలిపారు. డ్రైడేఫ్రైడే ను పాటించి పరిసరాలలో నీటి నిలువలు లేకుండా. చూడండి ఆరాగ్యాన్ని కాపాడుకోండి. చేతుల శుభ్రత పాటించాలని తెలిపారు.