బాలికల గురుకుల పాఠశాలను మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్య అభివృద్ధి కోసం గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్య ఇస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Health Minister Damodar Rajanarsimha) తెలిపారు. సోమవారం మునిపల్లి, రాయి కోడ్ మండలంలో ప్రకటించి గురుకుల పాఠశాలలను పరిశీలించారు. మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామంలోనీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పిజి కాలేజ్ ఫర్ ఉమెన్, ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించారు. కళాశాలలో జరుగుతున్న అదనపు తరగతుల భవన నిర్మాణాలను, డ్రైనేజీ వ్యవస్థను, క్రీడా మైదాన నిర్మాణ పనులను, కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను, అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తాటిపల్లి గ్రామంలోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను పరిశీలించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు.
కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. పాఠశాల అభివృద్ధి కి అవసరమైన మౌలిక సదుపాయాలను సిఎస్ఆర్ నిధులతో చేపడతామన్నారు. కేజీబీవీ పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు విశాలమైన డైనింగ్ హాల్ నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూమ్ లో ఏర్పాటు, ఆర్ ఓ ప్లాంట్, అదనపు తరగతి గదుల నిర్మాణం, పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులను సిఎస్ఆర్ ఫండ్స్ తో చేపడుతామన్నారు. రాయికోడు మండలంలోని నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ హాస్పిటల్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఆందోల్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాల బలోపేతానికి అధిక ప్రాధాన్యత. నియోజకవర్గంలో బాలికల విద్య ప్రోత్సాహానికి చర్యలు చేపట్టామన్నారు.