18-02-2025 12:00:00 AM
నారాయణ పాఠశాలలో ఆకట్టుకున్న మాస్టర్ చెఫ్
పాల్వంచ, ఫిబ్రవరి 17 ః ఆహా ఏమి రుచి తినరా మైమరచి అంటున్న చిన్నారులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోనీ నెహ్రునగర్ నారాయణ పాఠశాలలో మాస్టర్ చెఫ్ వంటల పోటీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
నారాయణ పాఠశాల పాల్వంచ శాఖ ప్రధానోపాధ్యాయులు పూరేటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కారక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ మాస్టర్ చెఫ్ స్టాళ్ళను ప్రారంభించారు.
ఈ మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు స్వయంగా చేసిన వంటలతో స్టాల్స్ ఏర్పాటు, విచ్చేసిన అతిథులకు రుచి చూపిస్తూ, చిన్నారులకు రుచికరమైన వంటకాలు సిద్ధం చేస్తేనే వారు ఇష్టంగా తింటారని, ఎదిగే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి దోహదపడే పదార్థాలతో నోరురూరించే విధంగా తయారు చేసిన వాటిని ప్రదర్శిస్తూ వాటిలో ఉండే పోషక విలువలను స్వయంగా వివరిం చారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిధి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఇప్పుడు చాలా మంది పిల్లలు పోషకాహార లోపాలతో లేదా ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్నారని, దానిని అధిగమిం చడానికి పాల్వంచ నారాయణ పాఠశాలలో మాస్టర్ చెఫ్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారువిశిష్ట అతిధిగా ఖమ్మం జోన్ ఈ చాంప్స్ కోఆర్డినేటర్ వినోద లక్ష్మి మాట్లాడుతూ ఈ రోజు నారాయణ పాఠశాలలో సంపూర్ణ పోషకాలతో అద్భుతంగా, రుచికర మైన వంటలు చేసిన విద్యార్థుల తల్లితండ్రులను అభినందించారు.
ప్రతి నెల న్యూట్రి డీల్ కార్యక్రమం ద్వారా కాలానుగుణంగా దొరికే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ప్రతి నెలలో ఒకసారి అందరు విద్యార్థులు విధిగా తినడం అలవాటు చేశామని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూరేటి నరసింహారావు మాట్లాడుతూ తమ పాఠశాలలో జంక్ ఫుడ్ ని నిషేదించామని, ప్రతి రోజు వాటర్ బెల్ ద్వారా పిల్లలతో విధిగా వాటర్ తాగించడం,
విరామ సమయంలో పిల్లలు పండ్లు, క్యారట్, బీట్రూట్, ఇంట్లో తయారు చేసిన పదార్థాలు తినే విధంగా పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. మాస్టర్ చెఫ్ పోటీ విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఈ చాంప్స్ వైస్ ప్రిన్సిపాల్ రుచిత శ్రీ, రహీమా, కళ్యాణి, శైలజ, శ్రీలత, ఉషా, అఫ్రీన్, జాహ్నవి, అలియా, నాగరాణి, వినయ్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.