calender_icon.png 12 February, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత పంటలతో ఆరోగ్యం భద్రం

12-02-2025 12:58:56 AM

  • ముగింపు జాతరలో పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు ..
  • చిరుధాన్యాల పంటలు సాగుచేసిన రైతులకు ఘనంగా సన్మానం

జహీరాబాద్, ఫిబ్రవరి 11: పాత పంటలను పండించి రైతులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని శాసనమండలి సభ్యులు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు రాములు నాయక్ అన్నారు. మంగళవారం ఝరాసంగం మండలంలోని మాచనూరు గ్రామ శివారులో ఉన్న వచ్చేసాయి లో జరిగిన పాత పండుగ జాతరలో పాల్గొని ప్రసంగించారు.  డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ మహిళా  25వ  సంవత్సరాలుగా పాత పంటల జాతర నిర్వహించడం అభినందనీయమన్నారు. 

పాత పంటల ముగింపు జాతర ఉత్సవాలను సీనియర్ సైంటిస్ట్ వరప్రసాద్,  సంగారెడ్డి జిల్లా నాబార్డ్ ప్రతినిధి కృష్ణ తేజ, ఎస్త్స్ర నరేష్, రాష్ట్ర రైతుల సంక్షేమ మెంబర్ భవాని రెడ్డి, డి డి ఎస్ డైరెక్టర్ దివ్య, జహీరాబాద్ వ్యవసాయ శాఖ అధికారి బిక్షపతి, లు పాల్గొని ప్రసంగించారు. ముగింపు సమావేశం ప్రారంభం కాకముందే అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ మనోజ్ ముగింపు కార్యక్రమం వద్ద ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు.. పాత పంటల ప్రాముఖ్యతను ఆ సంస్థలో పనిచేస్తున్న మహిళ సంఘాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

జొన్నలు రాగులు, కందులు పొండితులు సామలు వడ్లు, కొర్రలు సజ్జలు గోధుమలు తదితర పంటలను ఆయన పరిశీలించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు మాట్లాడుతూ మన రాష్ట్రంలో నేడు రైతులు వాణిజ్య పంటలను వేసి అప్పుల పాలాయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని దీనితో రసాయనకి ఎరువులు వాడడం వల్ల భూములు గుల్ల అవుతున్నాయని భూమిలోని  సారవంతం తగ్గి అవి పంటలు పండకుండా పోతున్నాయని ఆయన అన్నారు మా పూర్వీకులు పాత పంటలు వేసి ఎంతో ఆరోగ్యవంతంగా ఉండేవారని మేము కూడా చిన్ననాటి వయసులో పాత పనులు తిని ఆరోగ్యంగా ఉన్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిడిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్యా వెల్లూరి, గంగాధర్, రుక్మిణి రావుతో పాటు మహిళ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.