- కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్
- మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డు ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్ ‘మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డ్’ను ఆదివారం హైటెక్ సిటీ బ్రాంచ్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ అనిల్ కృష్ణతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ శరత్ రెడ్డి, పీ హరికృష్ణ, డాక్టర్ కృష్ణ ప్రసాద్, సినీనటుడు శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..
ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కని, ఈ కుటుంబ కార్డు నాణ్యమైన ఆరోగ్యాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కుటుంబ సంరక్షణ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఫామిలీ కార్డు ఒక ముందడుగు లాంటిదన్నారు. మెడికవర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డ్‌తో ప్రజల ముందుకొచ్చిందన్నారు.
అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్స్ సరసమైన ధరలతో ప్రజల ఆరోగ్య సంరక్షణకు పాటుపడుతున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు పేరు, వయస్సు, చిరునామా, ఫోన్ నంబర్, బ్లడ్ గ్రూప్ వంటి వివరాలను అందించడం ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఆ తర్వాత ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ కార్డ్ వెంటనే వాట్సాప్ ద్వారా జారీ చేస్తామన్నారు. అనంతరం ఫిజికల్ కార్డ్‌లు అందిస్తామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్‌రెడ్డి మాట్లాడుతూ.. మెడికవర్డ్ కార్డుతో మీరెక్కడున్నా, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందన్నారు.