- ఉచిత వైద్యమే ప్రభుత్వ లక్ష్యం
- ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.10లక్షలకు పెంచి కార్పొరేట్ హాస్పిటళ్లలోనూ పేదలకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆరోగ్యశ్రీ కోసం రూ.487 కోట్ల అదనపు బడ్జెట్ కేటాయించామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లోని షెరటన్ హోటల్‌లో శుక్రవారం ఓ ప్రైవే టు మ్యాగజైన్ ని ర్వహించిన బెస్ట్ హాస్పిటల్స్ అవా ర్డ్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడా రు. ఆరోగ్యవంతమైన పౌరులు ఉన్న సమాజం అభివృద్ధిలో ముందుంటుందన్నారు. రోగం వస్తే ఉచితంగా వైద్యం అందుతుందనే భ రోసా ప్రజలకు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం రోగులపై సానుభూతితో వ్యవహరించాలని, అధిక చార్జీలు వసూలు చేయొద్దని కోరారు. వైద్యో నారాయణ హరి అనే నానుడిని కాపాడుకోవాలని డాక్టర్లకు సూచించారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఏడాది కాలంలోనే 8 మెడికల్, 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలను ప్రారంభించామని వివరించారు.
పెరుగుతున్న నాన్ కమ్యూనికేబుల్ వ్యా ధుల సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలోనూ ఎన్‌సీడీ క్లినిక్‌ను ఏర్పాటు చేశామన్నారు. ‘హెల్త్ కేర్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్’ నినాదంతో ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్‌ను ప్రారంభించామని మంత్రి తెలిపారు. త్వరలోనే కొత్త ఉస్మానియా హాస్పిటల్‌కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు.