calender_icon.png 20 April, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం

14-04-2025 12:52:01 AM

ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం

ఖమ్మంలో ఐఎంఏ ఆధ్వర్యంలో జరిగిన సీపీడీ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి 

ఖమ్మం, ఏప్రిల్ 13 ( విజయక్రాంతి):- ప్రతీ ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యం కల్పించడ మే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రామి రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎం ఏ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్డియో క్రిటికల్ కేర్ రివ్యూ(సీపీడీ) కార్యక్ర మం ఖమ్మంలోని ఐఎంఏ భవన్లోని డాక్టర్ వైఆర్కే ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.

ఖమ్మం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐఎంఏ ప్రతినిధులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్యానికి ఇందిరమ్మ ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. ఐఎంఏ ప్రతినిధుల కోరిక మేరకు ట్రేడ్ లైసెన్స్ కోర్టు పరి ధిలో ఉన్నందున కొంత వెసులు బాటు కల్పించే విషయంలో మంత్రితో మాట్లాడి సహకరిస్తానని అన్నారు.

క్లినికల్ ఎస్టాబ్లిస్ మెంట్ యాక్ట్ దారుణంగా ఉందని ఐఎంఏ ప్రతినిధులు విన్నవించారనీ, ఈ విషయంలోనూ చర్చిస్తానని అన్నారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్కు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసే విధానంపై చర్చిస్తానని ఎంపీ అన్నారు. డాక్టర్లపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, హాస్పిటళ్లు ద్వంసం చేస్తున్నారని ఐఎంఏ బాధ్యులు ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఐఎంఏ బాధ్యు లు తన దృష్టికి తీసుకొచ్చిన వివిధ రకాల సమస్యలపై సాధ్యమైనంత మేరకు పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

రాష్ట్ర భారీ నీటిపారుదల, ఇందిరమ్మ హౌజింగ్ సొసైటీ చైర్మన్ మువ్వా విజయ్బాబు మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గా నికి 100 పడకల హాస్పిటళ్లు నిర్మాణం చేసేందుకు ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామిరెడ్డి, మువ్వా విజయ్బాబుకు ఐఎంఏ వైద్యులు సత్కారం చేశారు.

ఈ కార్యక్రమం లో  ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అశోక్, ఐఎంఏ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దయాళ్ సింగ్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ కాళీ ప్రసాద్, ఐఎంఏ రాష్ట్ర మాజీ కార్యదర్శి డా.విజయారావు, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.బొలికొండ శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డా.కంభంపాటి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి డా.కే.జగదీష్ బాబు, కోశాధికారి డా.స్వప్న, ఆయూష్ హాస్పిటల్(విజయవాడ) చైర్మన్ డా.గోపాల కృష్ణ, డా.సోమవేఖర్, డా.పూర్ణచందర్రావు, డా.రఘురాం, ఖమ్మం ఐఎంఏ సీనియర్ వైద్యనిపుణులు డా.కే గురునాథరావు, డా.బాగం కిషన్రావు, డా.వై. ప్రసాద్, ప్రముఖ కార్డియాక్ వైద్య నిపుణులు డా.ఎంఎఫ్ గోపీనాథ్, డా.అళనే ప్రవీణ్కుమార్, డా.పొన్నం సుబ్బారావు, డా.హర్ష తేజ, డా.జీఆర్ శ్రీహర్ష, డా.సీతారాం, ఖ మ్మం వైద్యనిపుణులు డా.కుసుమరాజు రవికుమార్, డా.కూరపాటి ప్రదీప్కుమార్, డా.రె హనాబేగం, డా.హరిప్రసాద్, డా.పాటిబండ్ల సుదర్శనరావు, డా.హనుమాన్, డాక్టర్ జి. వెంకటేశ్వర్లు (జీవీ),  మురళి, డా.నందనందన్, డా.శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.