04-03-2025 11:38:21 PM
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ డైరెక్టర్ అజయ్ కుమార్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులో తిరుగుతూ ఆసుపత్రి నిర్వహణ, అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం, తగిన సౌకర్యాలు లేకపోవడంతో పాటు ఆసుపత్రిలో నెలకొన్న వివిధ సమస్యలను హెల్త్ డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ... ఆసుపత్రి నిర్వహణ, ఆసుపత్రికి వచ్చే రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.