calender_icon.png 13 January, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో స్టేషన్లలో ఆరోగ్య కేంద్రాలు

16-09-2024 12:11:47 AM

మేయర్ గద్వాల విజయలక్ష్మి

ఎల్బీనగర్, సెప్టెంబర్ 15: దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ మెట్రోస్టేషన్‌లో ప్రయాణికులకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయని మేయర్ గద్వాల విజ యలక్ష్మి అన్నారు. మిట్టా ఎక్స్ లైన్స్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లోని మెట్రో స్టేషన్‌లో పాలీ హెల్త్ క్లినిక్‌ను ఆదివారం మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. మేయర్ మాట్లాడుతూ.. మొదటిసారిగా హెల్త్ ఏటీఎం ఎల్బీనగర్ స్టేషన్‌లో అందుబాటులోకి వచ్చిందన్నారు. హెల్త్ ఏటీఎంలో తక్కువ సమయంలో 250 రకాల రక్త పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చారు. మిట్టా ఎక్స్‌లైన్స్ చైర్మన్ డాక్టర్ మిట్టా శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యు డు సామిడి గోపాల్‌రెడ్డి, మిట్టా ఎక్స్‌లైన్స్ డైరెక్టర్లు నిఖిల్, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.