* వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబుయాదవ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 30: జలమండలి ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కోరారు. గురువారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు పదో న్నతులు కల్పించినందుకు ఎండీ అశోక్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
జలమండలిలో ఉద్యోగుల రిటైర్‌మెంట్లు ఎక్కువ కావడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. దీంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జలమండలిలో కొత్త నియామకాలు చేపట్టాలని కోరారు. తక్షణమే జలమండలి ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎలమయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ మేడ్చల్ శ్రీనివాస్, చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జమీల్ పాల్గొన్నారు.