calender_icon.png 29 March, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ హెల్త్ కార్డులు

25-03-2025 01:11:08 AM

ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో హెల్త్ కార్డుల జారీ కేంద్రం ప్రారంభం 

ఖమ్మం, మార్చి 24  ( విజయక్రాంతి ):- జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) పనిచేస్తోందని, జర్నలిస్టు కుటుంబ సభ్యులందరూ తప్పకుండా హెల్త్ కార్డులు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టిజెఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి కోరారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మూడు రోజులపాటు మార్చి 24 నుండి 26 వరకు కొనసాగనున్న జర్నలిస్టుల హెల్త్ కార్డు జారీ ప్రక్రియ క్యాంప్ కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జచిర్రా రవి మాట్లాడుతూ రాత్రింబవళ్లు విధి నిర్వహణలో ఉంటూ, ఊరుకుల పరుగుల జీవితంలో కంటికి నిద్ర లేకుండా పని జర్నలిస్టులకు తప్పకుండా హెల్త్ కార్డు కలిగి ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీజెఎఫ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టిఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కీ గోపి, యూనియన్ నాయకులు అంతోటి శ్రీనివాస్, కె. గోవింద్, ఉల్లోజి రమేష్, రోషి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.