calender_icon.png 19 April, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయమూర్తి చొరవతో వృద్ధులకు ఆరోగ్య శిబిరం

17-04-2025 07:40:21 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి T. నాగరాణి ఆధ్వర్యంలో కామారెడ్డి మండలం క్యాసంపల్లి లోగల వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అనంతరం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి చొరవతో వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా వృద్ధులతో మాట్లాడుతూ.. పెన్షన్స్ గురించి ఆరా తీశారు. పెన్షన్ రాని వారి వివరాలు తీసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పరిష్కారం కోసం న్యాయపరమైన చట్టాల గురించి వివరించారు. పరిసర ప్రాంతాలు తనిఖీ చేసారు. మెడికల్ క్యాంపు నిర్వహణలో భాగంగా వైద్యులు ప్రతి ఒక్కరిని ఆరోగ్య వివరాలు కనుక్కొని చెక్ చేయించారు. మందుల పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లికా జునైద్, మెడికల్ ఆఫీసర్, హోమియోపతి, డాక్టర్ దేవయ్య, మెడికల్ ఆఫీసర్, నేచురోపతి, DPM A. శ్రీకాంత్, ఫార్మాసిస్టులు రాజ్యలక్మి, పద్మ, కిషోర్, DLSA, LADCS సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.