calender_icon.png 2 February, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిలిం జర్నలిస్ట్‌ల కోసం హెల్త్ క్యాంప్

01-02-2025 11:41:38 PM

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ఈ రోజు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ హీరో విశ్వక్ సేన్ ఈ హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. “నిత్యం బిజీగా ఉండే ఫిలిం జర్నలిస్టు ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ అవసరం కాబట్టి ఇలాంటి క్యాంపు వల్ల మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి” అని చెప్పారు. ప్రముఖ హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “మా అందరితో సరదాగా ఉండే జర్నలిస్టులు ఎప్పుడు అదే విధంగా ఉండాలి అంటే దానికి హెల్త్ క్యాంపులు మరింత ఉపయోగపడతాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్  సీఓఓ భాస్కర్ రెడ్డి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్‌తో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు.