మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Manuguru Primary Health Center) పరిధిలోని ఎంజేపీటీబీసీ బాలురు పాఠశాల(MJPTBC Boys School)లో గురువారం హెల్త్ క్యాంపు(Health Camp) నిర్వహించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రమైన దుస్తులు ధరించాలని డాక్టర్ నిశాంత్ రావు ఈ సందర్భంగా విద్యార్థులు కు సూచించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ నందు లేప్రోసి పై అవగాహనా సదస్సు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. కార్యక్రమంలో సూపర్ వైజర్ లు సత్తెమ్మ, స్వరూప, హెల్త్ ఎడ్యుకేటర్ పరంగిని, సిబ్బంది రాంప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.