calender_icon.png 4 March, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల వసతిగృహంలో ఆరోగ్య శిబిరం

03-03-2025 05:06:05 PM

రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండల వైద్యాధికారి జంగంపల్లిలో ఉన్న బాలికల వసతి గృహంలో వైద్య శిబిరం నిర్వహించారు. భిక్కనూర్  మండలంలో కేజీబీవి బాలికలకు సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు రాజంపేట వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి తెలిపారు. ఈమె మాట్లాడుతూ... 45 మంది బాలికల వైద్య పరీక్షలు నిర్వహించి 42 మంది విద్యార్థులకు మందులు అందజేశారన్నారు. అనంతరం ఆరోగ్యంపై అవగాహన కల్పించమన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మంజూర్, శ్రీలత ఏఎన్ఎం, హాస్టల్ స్టాఫ్ నర్స్ పాల్గొన్నారు.