calender_icon.png 11 January, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబానీ ఇంట వివాహానికి దేశాధినేతలు.. సీఈవోలు

12-07-2024 12:45:43 AM

ముంబై, జూలై 11:  అనంత్ అం బానీ వివాహ మహోత్సవం శనివా రం జియో వరల్డ్ సెంటర్‌లో అట్ట హాసంగా జరగనున్నది. మూడు రోజుల పాటు జరిగే వివాహ మ హో త్సవాలకు భారీ సంఖ్యలో దేశ విదేశా ల నుంచి అతిథులు హాజరు కా ను న్నారు. తొలిరోజు ‘శుభ్ వివాహ్, 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న ‘మంగళ్ ఉత్సవ్’తో వేడుకలు ముగుస్తాయి. వే డుకలకు బ్రిటన్ మాజీ ప్రధానులు బ్లెయిర్, జాన్సన్, అమెరికన్ రియా లిటీ స్టార్లు కిమ్ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్, యూఎస్ విదేశాంగశాఖ మాజీ మంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిడ్త్, కెనడా మాజీ ప్రధా ని స్టీఫెన్ హార్పర్, టాంజా నియా అధ్యక్షుడు సామియ సులుహు, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్‌ఫాంటినో తది తరులు హాజరుకానున్నారు. వ్యాపార రంగం నుంచి హెచ్‌ఎస్‌బీసీ చైర్మన్ టకర్, అరామ్కో సీఈవో  నాస్సర్, మోర్గాన్‌స్టాన్లీ ఎండీ గ్రిమ్స్, అడోబ్ సీఈవో శంతను హాజరుకానున్నారు.