గత బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు
1 నుంచి ప్రజా సమస్యలపై పోరాటం
కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి
హనుమకొండ, అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వం మారింది తప్ప ప్రభుత్వ విధానాలు మారలేదని, తెలంగాణలో తలా తోక లేని పాలన కొనసాగుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ సభ్యత్వ నమో దు కార్యక్రమంలో భాగంగా సోమ వారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన భద్రకాళి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో అధికారంలోకి రాగానే పేదలకు హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు కానీ, సామాన్యులు కష్టపడి నిర్మించుకున్న ఇండ్లను కూల్చేస్తున్నదని ధ్వజమెత్తారు. నవంబర్ 1 నుంచి ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్దమవుతున్నట్టు ప్రకటించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు తిట్టుకోవడంలో పోటీ పడుతున్నారని, ఆ రెండు పార్టీలకు నైతిక విలువలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు చేసే అసభ్యకర వ్యాఖ్యలను ప్రసారం చేయవద్దని మీడియాను కోరారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను దృష్టిమళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ఇటీవల జరిగిన హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికలతో కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం లేదని తేలిపోయిందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడిందని, తెలంగాణలో గత బీఆర్‌ఎస్ మాదిరిగానే పాలన కొనసాగుతోందని ఎద్దేవాచేశారు. ఏ పథకానికి ఎలా వనరులు సమకూర్చుకోవాలో కూడా ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని విమర్శించారు.
మూసీ సుందరీకరణకు డీపీఆర్ లేదు
మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ఆ నిధులతో ఏం చేయబోతున్నదనే డీపీఆర్ మాత్రం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హామీలు ఇచ్చి చేతులెత్తయడమే కాంగ్రెస్ నైజమని దుయ్యబట్టారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైన్స్‌ను ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేసిందని మండిపడ్డారు. హర్యానాలో ఏడాది కాలం పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతు దీక్షలు చేశారని, అయినా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారని స్పష్టంచేశారు. 90 శాతం ముస్లింలు ఉన్న కశ్మీర్‌లో బీజేపీకి భారీగా ఓటు బ్యాంకు పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందని ఆరోపించారు.
తెలంగాణలో ఆలయాల అభివృద్ధి
తెలంగాణలో జోగులాంబ, భద్రాచలం, రామప్ప, బల్కంపేట అమ్మవారి ఆలయాల ను అభివృద్ధి చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. అయోధ్య, వారణాసి దేవాలయాలతో పాటు పంచ దేవాలయాలను కూడా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 150 దేవాలయాలకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.
ప్రతి పండుగలో యు వత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారని తెలిపారు. యువత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పా ల్గొంటే పెద్దల పట్ల గౌరవం, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుస్తుందన్నారు. పేదవా డి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో జాతీయ జెండాను నిలిపే వరకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.