calender_icon.png 22 April, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

13-04-2025 07:44:41 PM

తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన డేగవత్ రాములు (లంబాడి రాములు డ్రైవర్) సత్తెమ్మ కుమారుడు 1995 బ్యాచ్ కు చెందిన, డేగవత్ రమేష్(49) హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉండగా, గుండెపోటు రావడంతో తోటి సిబ్బంది సిపిఆర్ చేస్తూ ప్రైవేట్ దవాఖానకు తరలించినప్పటికీ మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. దీనితో ఒక్కసారిగా తుంగతుర్తి మండలంలో  విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏది ఏమైనా ప్రతి ఒక్కరితో కలుపుకోబోయే గుణం ఉండడం అందరినీ ఒక్కసారి దిగ్భ్రాంతి గురిచేసింది. రమేష్ మృతితో బంధువులు శ్రేయోభిలాషులు వివిధ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు