బైరి అమర్, -స్రవంతి పిల్లలను పరామర్శిస్తున్న కేటీఆర్
- సీఎంకు నేను నచ్చకుంటే కార్మికులపై కోపమెందుకు?
- మాజీ మంత్రి కేటీఆర్
సిరిసిల్ల, నవంబర్ 10 (విజయక్రాంతి): తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నందునే నేతన్నలపై సీఎం రేవంత్‌రెడ్డికి ప్రేమ కలగడం లేదంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. గొప్పగా నడుస్తున్న వస్త్ర వ్యాపార రంగాన్ని చంపేసే విధంగా శాడిస్టులా సీఎం వ్యవహరించడం మంచిది కాదని మండిపడ్డారు. సిరిసిల్లలో శనివారం ఆత్మహత్య చేసుకున్న బైరి అమర్, -స్రవంతి దంపతుల కుటుంబ సభ్యులను ఆదివారం రాత్రి కేటీఆర్ పరామ ర్శించారు. ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడాది క్రితం కామారెడ్డిలో కాం గ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలను ఇచ్చి బీసీలకు రంగుల కలను ప్రద ర్శించిందని ఎద్దేవా చేశారు. గత యేడాది ఉపాధి నిమిత్తం సోలాపూర్ వెళ్లి తిరిగి వచ్చి న వారు ఆత్మహత్యకు పాల్పడటం బాధ కల్గించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ పాలనతో 11 నెలల్లోనే సిరిసిల్లలో 20 మంది, రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల్లో 14 మంది ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నారని, వీటన్నింటికీ కాంగ్రెస్ ప్రభు త్వం బాధ్యత వహించాలన్నారు.
ప్రభుత్వ విధానాలతోనే సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని విమర్శించారు. సిరిసిల్ల నేతన్నలకు న్యాయం చేసే వరకు వదిలిపెట్టబోమని, అసరమైతే ప్రత్యక్ష పోరాటానికి వెనకాడబోమని హెచ్చరించారు. అనంతరం పట్టణంలో గతంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఉన్నారు.